లోక్‌సభ ఎన్నికలకు రెండో దశలో పోలింగ్‌ రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం..!

*🔹లోక్‌సభ ఎన్నికలకు రెండో దశలో పోలింగ్‌ రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం*

_12 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్._

_రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల._

_రెండో దశలో అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు._

_నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది_

_ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ_

నామినేషన్ల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ ఐదో తేదీన జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతుంది. 

అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించేందుకు చివరి తేదీ ఏప్రిల్‌ 8…

ఇక రెండో దశలోనే హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 19న ఇన్నర్‌ మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి..