లోక్ సభ ఎన్నికలకు బాధ్యతకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దే..!..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలకు ముందస్తుగానే సిద్దమవుతోంది భారత రాష్ట్ర సమితి పార్టీ. అధికారాన్ని కోల్పోవడంతో ఢీలా పడ్డ లీడర్లు, క్యాడర్ ను లోక్ సభ ఎన్నికలకు సంసిద్దం చేసే బాధ్యతకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు.. ఈ క్రమంలోనే లోక్ సభ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాల నిర్వహణకు కేటీఆర్ సిద్దమయ్యారు. కొత్త సంవత్సరం ఆరంభంలోనే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిస్తున్నారు.

జనవరి 3 నుండి అంటే వచ్చే బుధవారం నుండి ఒక్కో లోక్ సభకు చెందిన ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం కానున్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఏ తేదీల్లో ఏ నియోజకవర్గాల నాయకులతో కేటీఆర్ సమావేశం కానున్నారో బిఆర్ఎస్ ప్రకటించింది..