దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన..

మనం దేశంలోని అతిపెద్ద, అందమైన వంతెనల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలిస్తే ఎవరైనా ఎంతో ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వీటిలో కొన్ని చాలా పొడవు(length)గా ఉంటాయి. మరి కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్‌ఎల్) రెడీ అయింది. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సెవ్రీ, రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న నావా షెవా ప్రాంతం మధ్య ఈ వంతెనను నిర్మించారు. పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెనను సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. ప్రస్తుతం సెవ్రీ – నావా షెవా ప్రాంతాల మధ్య రాకపోకలకు సగటున 2 గంటల టైం పడుతోంది. ఈ వంతెన అందుబాటులోకి వచ్చాక కేవలం 20 నిమిషాల్లోనే సెవ్రీ – నావా షెవా ప్రాంతాల మధ్య శరవేగంగా రాకపోకలు సాగించొచ్చు.

‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ ముంబైలోని సెవ్రీ, నవీ ముంబై శివార్లలోని జాతీయ రహదారి 4బీపై శివాజీ నగర్, జస్సీ, చిర్లే వద్ద ఇంటర్‌ఛేంజ్‌లను కలిగి ఉంటుంది. జనవరి 12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఈవిషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం వెల్లడించారు. ఈ వంతెనతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పారు…