చైనాలో లాక్ డౌన్ తో ఆకలి కేకలు..

చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు...

చైనా ప్రభుత్వం షాంఘైలో చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం ఏ మాత్రం సరిపోవట్లేదని సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో చావడంకంటే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమమని పలువురు రోదిస్తున్న వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి. మరోవైపు, కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్న బాధితుల ఇండ్లల్లోని పెంపుడు కుక్కలు, పిల్లులను అధికారులు చంపేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మూగజీవాలపై ఇలాంటి చర్యలు అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.