వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.105 పెంపు…

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్‌కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.899.5 వద్ద స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మాత్రం రూ.105 పెంచారు…ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి.. వంట గ్యాస్‌ జోలికి పోకపోయినా.. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,012గా మారింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇక, 5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.27 పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి చేరింది.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లలో ఎలాంటి పెంపుదల లేదు. కాగా, ఎల్‌పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతి నెల సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గత నెలలో అంటే ఫిబ్రవరి 2022లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 91.50 తగ్గగా.. ఇప్పులు మళ్లీ వడ్డించారు.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.105 పెరిగి రూ.1,907 నుంచి రూ.2,012కి చేరగా.. . కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.108 పెరిగి రూ.2,095కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1,987గా ఉంది. మరోవైపు ముంబైలో రూ.1963కి చేరింది వాణిజ్య గ్యాస్ ధర… గతంలో ఇది రూ.1857 ఉండగా.. ఇప్పుడు రూ.106 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2145.5కి పెరిగింది. ఇక్కడ రూ.65 వడ్డించారు.. ఇంతకు ముందు ధర రూ.2080.5.గా ఉంది..