లులూ మాల్ చేరిపోయింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ప్రారంభం అయిన లులూ షాపింగ్ మాల్ చూడటానికి జనం ఎగబడ్డారు.. ఎంతలా అంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అయ్యే విధంగా.. వరసగా ఐదు రోజులు సెలవులు కావటంతో.. జనం అంతా అక్కడే ఉన్నారు…
లులూ సూపర్ మార్కెట్ కు వెళ్లిన జనం.. మాల్ లోని వస్తువులను మామూలుగా వాడేశారు.. అక్కడ ఉన్న కూల్ డ్రింగ్స్ ను తాగేశారు.. స్నాక్ ప్యాకేట్ ను తినేసి అక్కడే పెట్టేశారు.. బిస్కెట్లు, చాక్కెట్లను చప్పరించేశారు.. ఖాలీ ర్యాపర్స్ ను చక్కగా మళ్లీ అక్కడే ర్యాకుల్లో పడేశారు.. బాక్సుల్లో పెట్టిన ఎగ్ పప్స్, వెబ్ పఫ్స్ ను చక్కగా తినేశారు.. కొందరు అయితే వాటిని టేస్ట్ చేయటం కోసం కొంచెం తిని.. మిగతాది అదే బాక్స్ లో పెట్టేశారు..తెలంగాణలో ఫస్ట్ లులూ స్టోర్ కావటంతో.. ఎలా ఉంది.. ఏం ఉన్నాయి.. ఏయే వస్తువులు ఉన్నాయి.. ఎంతెంత ధరల్లో ఉన్నాయి అనేది తెలుసుకోవటం కోసం.. చూడటం కోసం తిరనాళ్లకు వచ్చినట్లు వచ్చారు జనం.. ఐదు రోజులు అయితే ట్రాఫిక్ నరకం.. అంతలా తండోపతండాలుగా వచ్చారు జనం. వచ్చినోళ్లల్లో అందరూ కాదు కానీ.. కొందరు మాత్రం ఇలా చేసి వెళ్లారు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..హైదరాబాద్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది.. మస్తుగా తిన్నారు.. ఫుల్ గా తగేరు…
అట్లుంటది మనతోటి అన్పిస్తరు. మొన్నట్ల లులూ మాల్ అని చాలైంది గద.. తెల్లార్తే యుగాంతం ఇగ మల్ల బత్కి సూడమన్నట్టే మాల్మీద మహిష్మతి మీద దండెత్తిన కాలకేయుల లెక్కనే దండెత్తిండ్రు..సరే దండెత్తిండ్రంటే దండిగ కొన్నరు గావొచ్చు అన్కునేరు.. అంత సీన్ లేదక్కడ..
దొంగలే మాల్ల దూరిండ్రా.. మాల్ల సొర్రినంక దొంగలైండ్రా తెల్వదిగాని.. ఇగ సూడుర్రి లూటు మాల్ను ఎట్ల లూఠీ చేస్కపోయిండ్రో..? పిడ్కెడిత్తులు తీశ్న దొంగతనం కాకపోదు గద.. పిప్పరమెంట్లు.. శాక్లెట్లు..బిస్కిట్లు..చిప్పులు, కూల్ డ్రింకులు, కేకులు దేన్ని ఇడ్శిపెట్టలే.. దొర్కిన కాడ్కి బరుక్కపోయిండ్రిట్ల..