ప్రకాష్ రాజ్‌ కు షాక్ ఇచ్చిన మంచు విష్ణు. `మా` అధ్యక్షుడిగా ఎన్నిక.. “మా” ఎలక్షన్ పై స్పందించిన చిరంజీవి…

మంచు విష్ణు విజయం…

తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “మా” ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాడు.

‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడ్డ విష్ణు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై గెలుపొందాడు.
.అటు విష్ణు ప్యానలకు చెందిన శివ బాలాజీ ట్రెజరరీగా, రఘుబాబు జనరల్ సెక్రటరీగా విజయం సాధించారు.మా’ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తైంది. అధ్య‌క్ష పీఠం కోసం త‌ల‌ప‌డ్డ‌ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌పై క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు, యువ హీరో మంచు విష్ణు విజ‌యం సాధించారు. కాసేప‌ట్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మొదటగా ఈసీ మెంబర్స్‌ ఓట్లను లెక్కించ‌గా.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు మొద‌ట వ‌రుస‌గా విజయాలు సాధించారు. శివారెడ్డి, అనసూయ, కౌశిక్‌, సురేశ్‌ కొండేటి గెలుపొందారు. త‌రువాత మంచు విష్ణు ప్యానల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్ , హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు…

మా ఎలక్షన్ పై చిరు కామెంట్స్..

ఈరోజు జరిగిన చిన్న చిన్న ఘటనలు నన్ను చూసి చిరంజీవి కొంత చలించిపోయి ఉండొచ్చని సినీ ఇండస్ట్రీలో భావిస్తున్నారు..
మా ఎన్నికల ఫలితాలపై కామెంట్ చేసిన చిరంజీవి.. చిన్న చిన్న పదవుల కోసం సినీ పరిశ్రమలో విద్వేషాలు పెంచుకోవద్దని సూచించారు. పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ కామెంట్స్
చేశారు. ఇదే వేదికపై రాఘవేంద్రరావు, వెంకటేశ్ ఉన్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు చిరంజీవి. అంతే కాదు.. వివాదాల సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని చిరంజీవి సూచించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని.. వివాదాలతో చులకన కావద్దని చిరంజీవి సూచించారు.

మా వంటి పదవులు తాత్కాలికమని చిరంజీవి అన్నారు. ఇవి రెండేళ్లో, మూడేళ్లో, నాలుగేళ్లో ఉంటాయని.. కానీ సినీ పరిశ్రమలలో మనం కలకాలం ఉండాలని చిరంజీవి అన్నారు. ఈ పదవులు తాత్కాలికమన్న చిరంజీవి.. మా సభ్యులంతా.. సినీ పరిశ్రమ అంతా వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాక్షించారు. అలా లేకుండా గొడవలు పడితే.. బయట వాళ్లకు ఎంత లోకువ అవుతాం అంటూ చిరంజీవి హితవు పలికారు. పదవుల కోసం ఒకరినొకరు కించపరచవద్దని చిరంజీవి సూచించారు.

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్న వెంకటేశ్, తాను ఇతర నటులు ఇప్పటికీ ఎంతో స్నేహంగా ఉంటున్నామని వెంకటేశ్‌ను ఆలింగనం చేసుకుంటూ చెప్పారు చిరంజీవి. మరి ఈ మా ఎన్నికల ఫలితాల సమయంలో చిరంజీవి చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఇకైనా మా గొడవలు సద్దుమణుగుతాయని ఆశిద్దాం.