పోస్టల్ బ్యాలెట్‌లో లెక్కింపు పూర్తి..లీడ్‌లో మంచు విష్ణు..మొత్తం మా ఎలక్షన్ ఎపిసోడ్..!.. మీరే చూడండి..

రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఈ స్థాయిలో ఎలక్షన్ ఎప్పుడూ జరగలేదు అని సినీవర్గాలు చెబుతున్నాయి..
*MAA Elections Update*

Total Voters – 905
Valid Voters – 883
Today Voting – 605
Postal Ballot – 60

*Total Counting – 665*.

R9TELUGUNEWS.com
: ‘మా’ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరివారు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ జరుగుతోంది. మురళీమోహన్, మోహన్ బాబు సమక్షంలో ఓట్లను లెక్కిస్తున్నారు.

మా ఎన్నికల్లో చివరి క్షణాల్లో హడావుడి..

మా ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆఖ‌రి నిమిష‌మే కీల‌కం కానుంది. మొత్తం 626 ఓట్లు పోల‌వ్వ‌గా ఇందులో ఆఖ‌రి నిమిషంలో 120 ఓట్లు పోల‌య్యాయి. ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి ప్రారంభం అయిన ఈ పోలింగ్ ఆద్యంతం ఆస‌క్తిదాయ‌కంగా సాగింది. సినిమా మ‌లుపుల‌ను త‌ల‌పించేలా తీవ్ర ఉత్కంఠ‌నూ, ఉద్వేగాన్నీ క‌లిగించాయి. ఓ ద‌శ‌లో ఎన్నిక‌లను వాయిదా వేస్తామ‌ని సంబంధిత అధికారులు హెచ్చ‌రించారు..
మొత్తం 883 మందికి ఓటు హ‌క్కు ఉండ‌గా, 605 మంది నేరుగా ఓటు వేశారు. 60 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. తొలిసారి ఈ విధానాన్ని ప్ర‌వేశ పెట్టారు. గ‌ణాంకాలను అనుస‌రించి ఇప్ప‌టిదాకా 75 శాతం ఓటింగ్ జ‌రిగింద‌ని తేలింది…

అయితే శివబాలాజీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను గౌతంరాజు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శివబాలాజీ మంచు విష్ణు ప్యానల్ తరపున పోటీ చేశారు. హేమ పంటి కాటు కారణంగానే శివబాలాజీ అస్వస్థతకు గురయ్యారని కొందరంటే.. మరికొందరు పంటికాటుతో విషమెక్కిందని జోకులు వేస్తున్నారు. హేమను విషకన్యగా పోలుస్తూ కొన్ని మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నటుడు శివబాలాజీ చేయి కొరికిన హేమ…

ఉదయం శివబాలాజీ చేతిని హేమ కొరికారు. చికిత్స కోసం శివబాలాజీ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లు శివబాలాజీ తెలిపారు. హేమ తన చేతికి ఎందుకు కొరికిందో తనకు తెలియడం లేదన్నారు. తన చేతికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు శివబాలాజీ చెప్పారు….

శివ బాలాజీ మాట్లాడుతూ…
‘నేను బారికేడ్లు పట్టుకున్నప్పుడు, హేమ నా వెనుక ఉంది. అపరిచితుడు వారి ప్యానెల్‌కు చెందినవాడు కావడంతో, కోపంగా ఉన్న హేమ, నా చేయి పైకెత్తకుండా నిరోధించడానికి ప్రయత్నించింది, అలా చేయడానికి, నన్ను కొరికింది. హేమ నా చేతిని ఏ మూడ్‌లో కొరికిందో నేను గమనించలేదు.’ అన్నాడు…

పోస్టల్ బ్యాలెట్‌లో లెక్కింపు పూర్తి.. లీడ్‌లో మంచు విష్ణు
ముందుగా చెప్పినట్లు మంచు విష్ణు తెలిపిన ప్రకారమే..
ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ లు తనకే వస్తుందని ఆయన నమ్మకం గా ఉండగా అనుకున్నట్లుగానే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ లు ఆయన ఎక్కువగా పడడం విశేషం. కొంతమంది నటీనటులు ఎలక్షన్ కేంద్రానికి హాజరు కాకపోతే వారు పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచు. ఆ విధంగా తొలిసారి ఈ మా ఎలక్షన్ లో ఈ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని తీసుకు రాగా ఈ పోస్టల్ బ్యాలెట్ విధానం పై తొలుత ప్రకాష్ రాజ్ కొంత ఆందోళన చేపట్టారు.

ఇప్ప‌టిదాకా ఉన్న స‌మాచారం ప్ర‌కారం మొత్తం 883 మందికి ఓటు హ‌క్కు ఉండ‌గా, 605 మంది నేరుగా ఓటు వేశారు. 60 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. తొలిసారి ఈ విధానాన్ని ప్ర‌వేశ పెట్టారు. గ‌ణాంకాలను అనుస‌రించి ఇప్ప‌టిదాకా 75 శాతం ఓటింగ్ జ‌రిగింద‌ని తేలింది…