గుంటూరులో ఘనంగా జరిగిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు…
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.. గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు.
రారా రెడ్డి పాటలోని ‘రానురాను అంటుంది చిన్నదోయ్’ పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు. ఇక ట్రైలర్ నిడివి… రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్….
మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు. ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది…
నికితారెడ్డి మాట్లాడుతూ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ గుంటూరు లో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. అభిమానులు భారీ ఎత్తున ఈ వేడుకకు రావడం ఇంకా ఆనందంగా వుంది. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఆగస్ట్ 12 తప్పకుండా ఈ సినిమా చూసి చాలా పెద్ద విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను…