మ‌ద‌ర్సాల‌లో భ‌గ‌వ‌ద్గీత‌, రామాయ‌ణం..

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్‌) కింద ఓ కొత్త కోర్సును ప్ర‌వేశ‌పెడుతోంది. ఇందులో భాగంగా 100 మ‌ద‌ర్సాలలో ప్రాచీన భార‌త విజ్ఞానం, సాంప్ర‌దాయాల‌పై పాఠాలు బోధించ‌నున్నారు. మూడు, ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తుల‌ క‌రికుల‌మ్‌లో ఈ ప్ర‌త్యేక పాఠాలు ఉంటాయి. దీని కోసం ప్ర‌త్యేకంగా 15 ఆర్టిక‌ల్స్‌ను సిద్ధం చేశారు. వీటిలో వేదాలు, భ‌గ‌వ‌ద్గీత‌, రామాయ‌ణం, యోగా, సైన్స్, సంస్కృతంలాంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి 100 మ‌ద‌ర్సాల‌లో ఈ కోర్సు ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని, భ‌విష్య‌త్తులో దీనిని 500ల‌కు తీసుకు వెళ్ల‌నున్న‌ట్లు ఎన్ఐఓఎస్ చైర్మ‌న్ స‌రోజ్ శ‌ర్మ వెల్ల‌డించారు.