మధ్యప్రదేశ్ లొ నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…!

మధ్యప్రదేశ్ లొ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 230 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. వివిధ పార్టీల తరఫున ఈ రాష్ట్రంలో 2,534 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 252 మహిళా అభ్యర్థులు ఉన్నారు…ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే కనిపిస్తోంది. మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. ఈసారి పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్లో జెండా పాతాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,88,25 607 మంది, మహిళలు 2,72,33,945 మంది, ఒకవెయ్యి 3 వందల 73మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,626 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అయి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ పోలింగ్ అనంతరం.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.