మ‌ధుమేహం కీర‌దోస , పుచ్చకాయ అదుపులో పెట్టొచ్చు..!

మ‌ధుమేహం ఒక దీర్ఘ‌కాలిక వ్యాధి. ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన‌ప‌డే వారి సంఖ్య‌ వేగంగా పెరుగుతున్న‌ది. అధిక కేలరీలున్న‌ ఆహారం తీసుకోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్త‌ర‌ణ‌కు ప్ర‌ధాన కార‌ణాలు. జీవనశైలిలో, ఆహారపు అల‌వాట్ల‌లో కొన్ని మార్పులు చేసుకోవ‌డం ద్వారా మ‌ధుమేహాన్ని అదుపులో పెట్టుకోవ‌చ్చు. అందులోభాగంగా ఇప్పుడు కీర‌దోస‌కాయ మ‌ధుమేహం నియంత్ర‌ణ‌కు ఏవిధంగా తోడ్ప‌డుతుందో తెలుసుకుందాం..!

ఒక అధ్యయనం ప్రకారం.. కీర‌దోస కాయ‌లు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. ఇవి హైపర్ గ్లైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి. కీర‌దోసవ‌ల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త‌గ్గుతాయి. కీర‌దోసను త‌ర‌చూ తీసుకోవ‌డంవ‌ల్ల శ‌రీరంలో కొవ్వులు త‌గ్గిపోతాయి. దాంతో బ‌రువు త‌గ్గ‌డంతోపాటు డ‌యాబెటిస్ కూడా త‌గ్గిపోతుంది. దోసకాయల్లోని యాంటీ-హైపర్ గ్లైసిమిక్‌ ప్రభావం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి సాయపడుతుంది. దోస‌కాయ‌ల‌పై తొక్క‌లు కూడా మ‌ధుమేహుల‌కు ఎంతో మేలు చేస్తాయ‌ట‌. ఎందుకంటే దోస‌ తొక్క‌ల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, పాలీఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంతో కీల‌కపాత్ర పోషిస్తాయి…
దోసకాయల్లోని యాంటీ-హైపర్ గ్లైసిమిక్‌ ప్రభావం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి సాయపడుతుంది.
దోస‌కాయ‌ల‌పై తొక్క‌లు కూడా మ‌ధుమేహుల‌కు ఎంతో మేలు చేస్తాయ‌ట‌. ఎందుకంటే దోస‌ తొక్క‌ల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, పాలీఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంతో కీల‌కపాత్ర పోషిస్తాయి.

పుష్కలంగా పోషకాలు, విటమిన్లు:
పుచ్చకాయలో ఒక్క పిండి పదార్థమే కాదు.. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి1, బి6, విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, క్యాల్షియం, లైకోపేన్‌ వంటి పోషకాలూ ఉంటాయి. విటమిన్‌ ఎ గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. విటమిన్‌ సి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.

కిడ్నీలకు మంచిది:
పుచ్చకాయ గుజ్జుకు ఎర్రటి రంగునిచ్చే లైకోపేన్‌ సైతం యాంటీ ఆక్సిడెంటే. ఇక దీనిలోని పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణ మెరుగుపడేలా, కిడ్నీలు సరిగా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు, దీనిలోని సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం రక్తపోటు తగ్గటానికి, జీవక్రియలు చురుగా సాగటానికి తోడ్పడుతుంది. ఇవన్నీ మధుమేహులకు మేలు చేసేవే. ఒక్క గ్లూకోజు భయంతో పుచ్చకాయ తినటం మానేస్తే ఇలాంటి ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు…

ఈ వేసవిలో అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. మరి పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లు వాటిని తినొచ్చా? లేదా ? అనే సందేహం చాలామందిలో ఉంది. పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వేగంగా కలుస్తోందనే దాన్ని ఒక సంఖ్యతో సూచిస్తారు. దీన్ని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) అంటారు. ఇది అధికంగా ఉండే పదార్థాల విషయంలో మధుమేహులు జాగ్రత్తగా ఉండటం మంచిదే. పుచ్చకాయ జీఐ 72. నిజానికిది దాదాపు కూల్‌డ్రింక్ తో సమానమే అయినప్పటికీ పుచ్చకాయలో పిండి పదార్థం చాలా తక్కువ.