ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం..!!!రాజీనామా లేఖను కూడా నా వద్ద సిద్ధంగా ఉన్నది.సీఎం ఉద్ధవ్ థాకరే….
శివసేనకు చెందిన కీలక నేత ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడంతో సీఎం ఉద్ధవ్ థాకరే సర్కారు మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం తానేమీ పోరాటం చేయబోనని… ఎమ్మెల్యేలు తాను సీఎంగా కొనసాగకూడదని భావిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, రాజీనామా లేఖను కూడా తన వద్ద సిద్ధంగా ఉంచుకున్నానని ఆయన ప్రకటించారు. అయితే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా థాకరే ప్రకటించలేదు. అయితే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ముంబైలోని మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లా నుంచి ఆయన తన లగేజీని బయటకు తరలించారు. మాతోశ్రీ పేరిట థాకరేకు సొంత నివాసం ఉన్న సంగతి తెలిసిందే. వర్ష బంగ్లా నుంచి తన సామాగ్రిని తరలించడమంటే సీఎంగా దిగిపోయే దిశగానే థాకరే అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాని ప్రస్తుతం నెట్లో మాత్రమ్ వర్ష బంగ్లా నుంచి తన సామాగ్రిని థాకరే తరలిస్తున్న వీడియో వైరల్‌గా అయ్యింది…