మహారాష్ట్రలో బతుకమ్మ వేడుకలు: హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత..

హైదరాబాద్‌: అక్టోబర్‌ 09
భారత జాగృతి మహారాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బతుకమ్మ సంబురాలకు ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని భారత జాగృతి మహారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ సుల్గే తెలిపారు.

ఈ సంబురాలకు సంబంధించి పోస్టర్‌ను ఇటీవల కవిత ఆవిష్కరించారని ఆదివారం సాయంత్రం ప్రకటనలో పేర్కొన్నారు.

గత 10 సంవత్సరాలుగా ముంబైలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటల నుంచి ముంబై దాదర్‌లోని యోగి సభా గృహంలో, 22న షోలాపూర్‌లో బతు కమ్మ సంబురాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

సంబురాల్లో ఆడపడుచులు చక్కగా పేర్చిన బతుకమ్మలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. ముంబై, నవీ ముంబై, థానే, భీవండికి చెందిన ఆడ పడుచులు బతుకమ్మ సంబురాలకు పెద్దసంఖ్యలో హాజరుకావాలని శ్రీనివాస్‌ సుల్గే పిలుపునిచ్చారు…