మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి…. సీఎం కేసీఆర్‌..

మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్రలోని కాందార్‌ లోహలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్‌ లోహలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత రాష్ట్ర సమితి పార్టీని మహారాష్ట్రలోనూ రిజిష్టర్‌ చేయించాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి. స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలి. మీ సమస్యలు పరిష్కరించి చూపిస్తా. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేకచోట్ల నుంచి కోరుతున్నారు. తర్వాత షోలాపూర్‌లో సభ పెట్టనున్నాం.

మేం నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారు. బీఆర్ఎస్​ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా? ఫసల్‌ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా? బీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకున్ని ఎన్నుకుంటే మార్పు వస్తుంది. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుంది. ఒక్క ఝలక్‌ ఇవ్వండి.. మొత్తం మారిపోతుంది. గతంలో మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేది. తొమ్మిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చేశాం. 24 గంటలు పని చేసే నాందేడ్‌ ఎయిర్‌పోర్ట్‌ను పగటికే పరిమితం చేశారు. దేశం ముందుకు వెళ్తోందా..? వెనక్కి వెళ్తోందా? అనేక మంది ఉద్యమకారుల జన్మభూమి మహారాష్ట్ర. మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదు. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదు’ అన్నారు.