మహారాష్ట్రలో అక్రమ కట్టడాల కూల్చివేత… కారణం ఇదే..!.

అక్రమ కట్టడాల కూల్చివేత ..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్‌ బుల్డోజర్‌ చర్యకు దిగింది..

యుపి నుండి ‘బుల్డోజర్‌ రాజ్‌’ మహారాష్ట్రకు పాకింది. ముంబయిలోని మీరారోడ్‌లో షిండే ప్రభుత్వం మంగళవారం భారీగా బుల్డోజర్‌లను మోహరించింది.

రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్‌లతో కూల్చివేసింది…

సోమవారం అమోధ్య రామ్‌ మందిరంలో విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయిలోని మిరా రోడ్‌లో కాషాయ జెండాలతో ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీపై ఒక వర్గాల దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు… ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. మీరా రోడ్‌లోని నయానగర్‌ ప్రాంతంలో కాషాయ జెండాలతో వెళుతున్న పలు కార్లు, బైక్‌లపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారితీసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు..