నాపై కొందరు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదు..అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతాను..

‘నాపై కొందరు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదు.. తెదేపా-జనసేనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతాను’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి మహాసేన రాజేష్‌ శనివారం ప్రకటించారు..ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పి.గన్నవరం అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా ఉత్తరకంచిలోని తన నివాసంలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు..