మహాశివరాత్రి సందర్బంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ గ్రాండ్ ట్రీట్‌ అవబోతుంది….

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో ప్రతిష్టాత్మక మూవీ `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు…సినిమా సినిమాకీ సంవత్సరాలు తరబడి టైమ్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్స్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్, అందులోనూ రామాయణం.. ఇక ఈ సినిమా ఎప్పటికవుతుందో అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్లందరి నోళ్లు మూయిస్తున్నారు ‘ఆదిపురుష్’ టీమ్..మరి జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తున్న ‘ఆదిపురుష్’…..ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. రేపు మంగళవారం ఉదయం(మార్చి1)న అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నట్టు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఏడుగంటల సమయంలో ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఓ రకంగా మహాశివరాత్రి సందర్బంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ కిది మంచి ట్రీట్‌ అవబోతుందని చెప్పొచ్చు. అయితే ఏం అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం నుంచి ఏదైనా గ్లింప్స్ ఇవ్వబోతున్నారా? లేక సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారా? అనే ఊహాగానాలకు పని పెట్టారు నెటిజన్లు. దీంతో ఇప్పుడిది ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది.