ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా… మహేశ్ బాబు ఎమోషనల్ సందేశం…!!

*హైదరాబాద్…

ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా… మహేశ్ బాబు ఎమోషనల్ సందేశం.

ఇటీవల కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ… తీవ్ర విషాదంలో మహేశ్ బాబు.

*- తాజాగా సోషల్ మీడియాలో ప్రకటన*

*- నాన్నా మీ జీవితం చరితార్థం చేసుకున్నారని వెల్లడి*

*- ఇప్పుడొక కొత్త ఫీలింగ్ కలుగుతోందని వివరణ*

★ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ మృతి నేపథ్యంలో భావోద్వేగ ప్రకటన వెలువరించారు.

★ తెలుగు సినీ పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

★ కొన్ని నెలల వ్యవధిలోనే సోదరుడు, తల్లి, తండ్రి మరణంతో మహేశ్ బాబు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.

★ అయితే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆయన తాజా సందేశం విడుదల చేశారు. తండ్రిని వేనోళ్ల కీర్తించారు.

★ _*”నాన్నా… మీ జీవితం చరితార్థం చేసుకున్నారు. మీ నిష్క్రమణం మరింత వైభవంగా జరిగింది. అది మీ గొప్పదనం నాన్నా. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి, నా గుండెధైర్యం అన్నీ మీతోనే పోయాయని అనుకున్నాను. కానీ విచిత్రం…! మునుపెన్నడూ లేనంత కొత్త శక్తి ఇప్పుడు నాలో కలిగింది. ఇప్పుడు నాకు భయమే లేదు నాన్నా! మీ దివ్యజ్యోతి నాపై ప్రసరిస్తున్నంత కాలం మీ ఘనతర వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళతాను… మీరు మరింత గర్వించేలా చేస్తాను… లవ్యూ నాన్నా… మీరే నా సూపర్ స్టార్!”*_ అంటూ తన ప్రకటనలో వివరించారు.