పాస్ పోర్ట్ లపై ఇక మైక్రో చిప్..కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి చెప్పారు. పాస్ పోర్ట్ లన్నీ ఇకపై మైక్రో చిప్ ద్వారా వుండనున్నాయి. పౌరులకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇందులోనే వుంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేకుండా మైక్రో చిప్ లు తయారుచేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. ఈ-పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటుంది…అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ల వద్ద ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకుని వెళ్లిపోయేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ వీటిని తయారు చేసినట్టు ట్వీట్ చేశారు. మైక్రోచిప్ ను అమర్చిన పాస్ పోర్ట్ కార్డును కేంద్రం జారీ చేయనుంది, చిప్ లో కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాయంతో ఇందులోని డేటాను బదిలీ చేసుకోవడానికి వీల్లేదు. ప్రయోగాత్మకంగా 20,000 మంది దౌత్య సిబ్బందికి ఈ-పాస్ పోర్ట్ లను ఇచ్చి చూశారు. అన్నింటినీ పరిశీలించిన అనంతరం పౌరులు అందరికీ దీన్ని త్వరలోనే మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఏడాది నుంచి ఈ పాస్ పోర్టులు జారీ అవుతాయని ఆయన చెబుతున్నారు…