మయన్మార్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు భారత్‌లో ఆశ్రయం కోరారు..

మయన్మార్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు భారత్‌లో ఆశ్రయం కోరారు. సైనిక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయవలసిన పరిస్థితులను తప్పించుకోవడానికి… పలువురు పోలీసులు ఇండియాకు వచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఏర్పడిన సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమంలో కొందరు పోలీసులు కూడా పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, పోలీసులు దేశం విడిచి పారిపోయిన సంఘటన బయటపడటం ఇదే తొలిసారి. తమకు సైనిక పాలకులు జారీ చేసిన ఆదేశాలను తాము అమలు చేయలేమని, అందుకే దేశం నుంచి పారిపోయి వచ్చామని మయన్మార్ పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిపారు. కాగా, సైనిక ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది.. రోజురోజుకీ తీవ్రమవుతోంది.. ఆ ఉద్యమాన్ని అణచడానికి సైనికులు, పోలీసులు.. కాల్పులు జరుపుతున్నా.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కనీసం 19 మంది మయన్మార్ పోలీసు అధికారులు భారతదేశంలోకి ప్రవేశించి ఆశ్రయం పొందుతున్నట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.