పొలాలు ఎండుతున్న ఈ మంత్రులకు సోయలేదు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

*పొలాలు ఎండుతున్న ఈ మంత్రులకు సోయలేదు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..*

*రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతాను అంటున్నారు.. కాంగ్రెస్ మంత్రులు*

*హుజూర్నగర్ నియోజకవర్గంలో పార్టీ నాయకులకు నేనెప్పుడూ అండగానే ఉంటాను..*

*కాంగ్రెస్ పాలనపై ప్రజలకి అప్పుడే విరక్తి పుట్టింది..*

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్నగర్ లో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి బడుగుల లింగయ్య యాదవ్… ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
ఎమ్మెల్సీ ఎంసీ కొట్టిరెడ్డి,
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి… విజయ్ సింహ రెడ్డి… హాజరైన జడ్పిటిసిలు, ఎంపీటీసీలు , ఎంపీపీలు..
భారీగా హాజరైన బిఆర్ఎస్ శ్రేణులు…. *మాజీ మంత్రి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ* .. వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కరువులో ముంచింది….

పాలన పై అవగాహన లేని నాయకులు రాజ్యమేలుతున్నారు…

రైతులనే చెప్పుతో కొడతా అనే స్థాయికి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఎదిగారు…

నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి కూడా కనీసం ముందస్తు నియోజకవర్గంలో పొలాలకు నీరు అందించాలనే ఆలోచన లేకపోవడం వల్లే పొలాలు ఎండిపోయాయి..

అప్పుడే పుట్టిన పసిపాప అని చెప్పుకుంటూ తమపై నిందలు వేస్తారా అని చెప్పుకుంటూ తిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి వంద రోజులైంది ఏం సాధించారో ప్రజలందరికీ వివరించాలన్నారు..

వారి గెలిచాక ఎకరాకి అదనంగా ఇస్తానన్న రైతుబంధు డబ్బులు ఎక్కడ పోయాయి..

రుణమాఫీ ఏమైపోయింది…

అమలు కానీ దరిద్రమైన హామీలు ఇచ్చి ఈరోజు మొఖం చాటేస్తున్నారు. ….

ఒడ్లు అమ్మకానికి రైతులు ఇబ్బంది పడుతుంటే ,, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేసే పద్ధతులలో కూడా వ్యవహరిస్తున్నారు….

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలు బ్లాక్మెయిలు,, అక్రమాలకు,, బెదిరింపులకి మారుపేరు..

కనీసం రైతులకు కరెంట్ అందించాలనే సోయ కూడా లేని ప్రభుత్వం ఇది…

పట్టా రైతులు కౌలు రైతులు పొలవండి పోయి నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆ వైపు కూడా తిరిగి చూడని మంత్రులు తెలంగాణలో ఉన్నరు ..

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు…

జాతీయ పార్టీలు అని చెప్పుకునే రెండు పార్టీలకు కూడా అభ్యర్థులు గతి లేకుండా బిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులని తమ పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్లు ఇస్తున్నారు..

కొన్ని పనికిమాలిన దరిద్రపు ఛానల్ లు బిఆర్ఎస్ పార్టీ పని ఏదో అయిపోయినట్టు ప్రచారం చేసుకుంటున్నరు …

ఇన్ని రోజులు తెలంగాణలో ఆంధ్ర పెత్తనం సాగలేదు ప్రస్తుతం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఆంధ్ర మీడియాకు బిఆర్ఎస్ పార్టీపై బూరద చల్లడమే పనిగా పెట్టుకున్నాయి…..

బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ..

బిఆర్ఎస్ పార్టీ లో నికసైన అయిన ఉద్యమకారులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు..

పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు వ్యక్తులు ముఖ్యం కాదు…..

గతంలో ఎలా అయితే పార్టీ ఉందో అంతకంటే ఎక్కువ రెట్లు ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది..

ప్రస్తుతం ప్రతి ఒక కార్యకర్త ముఖంలో చిరునవ్వు కనబడుతుంది…

నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటాను ,,

ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అండగా ఉంటా అన్నారు..