బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన..తన ఆలోచన ఒకేలా ఉన్నాది..సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలతోనే సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.
నిన్న ప్రగతిభవన్‌ వెళ్లిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్..సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన..తన ఆలోచన ఒకేలా ఉన్నాయన్నారు. బీజేపీ వైఖరిని వ్యతిరేకించడంలో ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు. బీజేపీని సీఎం కేసీఆర్ గట్టి ఎదురిస్తున్నారని..ఆయనకు ఓ స్పష్టత ఉందని తెలిపారు. దేశంలోని పరిస్థితుల పట్ల సీఎం కేసీఆర్‌కు అవగాహన ఉందని..ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ వల్ల దేశానికి ప్రమాదం ఉందన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించిన వాళ్లపై బీజేపీ కేసులు పెడుతోందని ఆరోపించారు. .. బిజెపికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ అందరితో మాట్లాడుతూ కలుపుకొని పోతూ ఒక తాటిపైకి లాగే శక్తి ఉన్న వ్యక్తి అని.. కాంగ్రెస్ గతంలో బలంగా ఉందని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా దేశంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని అన్నారు… కెసిఆర్ పలు రాష్ట్రాల సీఎంతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతనే ఓ నిర్ణయానికి వచ్చారని అన్నారు…. ఏ భాషలోనైనా మాట్లాడి బిజెపి చేస్తున్న తప్పిదాలను వివరిస్తే చాలు, బిజెపి విఫలమైనట్లు.. ప్రజల్లో బలంగా నమ్ముతారు..