మేజర్ సినిమా బ్లాక్ బస్టర్…మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 35.60 కోట్లకి కలెక్షన్లు..

ఈ మధ్యనే విడుదలైన సినిమా “మేజర్”. 26/11 ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 3న థియేటర్లలో విడుదల అయింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు నిర్మించారు…ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు దూసుకు వెళుతోంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 35.60 కోట్లకి కలెక్షన్లు చేరుకున్నాయి. మొదటి రోజున 13.40 కోట్లు అందుకున్న ఈ సినిమా 35.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మొదటి వారాంతం ను పూర్తి చేసుకుంది…