ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ…

ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో మోడీ మహాకాళ్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మహాకాళ్ల లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళ్ మందిరం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా కాంతులీనింది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు…