కనిపించిన మకర జ్యోతి.. పులకించిన భక్త జనం..

శబరిమల శరణఘోషతో మారు మోగింది. మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. గురువారం సాయంత్రం గంటలకు మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చారు….. శబరిమలై పొన్నంబలమేడుపై దర్శనం ఇచ్చిన మకరజ్యోతి. అయ్యప్ప ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నం బలమేడు ఉంటుంది… అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిన అయ్యప్ప ఆలయ ప్రాంగణాలు.. మకర జ్యోతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. జ్యోతి దర్శనం కోసం పంబానది పులిమేడు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..
కేరళలోని శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి. సంక్రాంతి రోజున ఈ దివ్య దర్శనం కోసం అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు.