మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..షాక్‌కు గురిచేసింది..!.

https://x.com/i/status/2004265868708987260

సౌదీ అరేబియాలోని మక్కాలో కలకలం చెలరేగింది. మసీదు అల్-హరమ్ (గ్రాండ్ మసీదు)లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్‌నకు గురిచేసింది..మసీదు పైఅంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించాలని ఆ వ్యక్తి ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అతనిని కాపాడారు.

మక్కాలోని మసీదు అల్-హరామ్ పై అంతస్తుల నుండి దూకి ఒక వ్యక్తి తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ భద్రతా సిబ్బంది వేగంగా జోక్యం చేసుకోవడం వల్ల అతడికి ప్రాణాపాయం తప్పిందని సౌదీ అధికారులు గురువారం తెలిపారు..

ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మసీదు పై అంతస్తు రెయిలింగ్ దాటి, ఒక వ్యక్తి కిందకు దూకబోతుండగా, స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆ భద్రతా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..ఈ ఉదంతంపై మక్కా ప్రాంతీయ ఎమిరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని నివారించిందని దానిలో కొనియాడింది. అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భద్రతా అధికారికి ఫ్రాక్చర్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితునిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం విచారణ చేపడుతున్నామని మక్కా భద్రతా దళాలు వెల్లడించాయి.