నేపాల్ కు.700 కోట్లు, మాల్దీవ్స్ కు .600 కోట్లు కేటాయించిన భారత్..

భారత్, మాల్దీవ్స్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్నసంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ మంత్రులు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు..దీంతో ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మాల్దీవ్స్ కు వెళ్లే భారతీయులు తమ పర్యటను రద్దు చేసుకోవడంతో ఆ దేశంపై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.

అయితే మాల్దీవ్స్ అంత చేసినప్పటికీ భారత ప్రభుత్వం మంచి మనస్సుతో ఆ దేశ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. మాల్దీవ్స్ కు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధులు గతం కంటే 50 శాతం పెంచారు. భారత బడ్జెట్ లో పొగురు దేశాలకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు కేటాయిస్తారు. ఇందులో భాగంగా మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటన్, నేపాల్, అఫ్ఘానిస్థాన్ కు నిధులు కేటాయించారు..ఈ బడ్జెట్ లో అఫ్ఘానిస్థాన్ కు రూ.200 కోట్లు కేటాయించగా.. బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు కేటాయించారు. నేపాల్ కు రూ.700 కోట్లు, భూటాన్ కు రూ.2,068 కోట్లు, మాల్దీవ్స్ కు రూ.600 కోట్లు కేటాయించారు. పొరుగు దేశాలతో సంబంధాలను బలపరిచే చర్యల్లో భాగంగా ఆ దేశాలకు నిధులు కేటాయిస్తుంటారు. ఈ దేశాలకే కాకుండా ఇరాన్ తో కలిసి చేపట్టిన అనుసంధాన్ ప్రాజెక్టు చాబహార్ పోర్టుకు రూ.100 కోట్లు కేటాయించారు.

ఆ దేశాలు ఈ నిధులను ఇంజినీరింగ్‌, ఐటీ, వాణిజ్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. మాల్దీవ్స్ ఇంతే చేసినా.. ఆదేశానికి నిధులు కేటాయించడం భారత గొప్పతనమని పలువురు ప్రశంసిస్తున్నారు. మాల్దీవ్స్ ప్రభుత్వం భారత్ పట్ల అవలభిస్తున్నవిధానాలను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..