సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొంతమంది డిప్యూటీ మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నం…చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మాల్దీవ్స్…..

మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ
( MATI) తాజా వివాదంపై స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొంతమంది డిప్యూటీ మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది..మాల్దీవుల చరిత్రలో సంక్షోభాలకు భారతదేశం ఎల్లప్పుడూ మొదటిగా స్పందించిందని పేర్కొంది.

“కొందరు ఉప మంత్రులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారత ప్రధాని, గౌరవనీయులైన నరేంద్ర మోడీతో పాటు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశం మన పొరుగు దేశాలలో ఒకటి, మిత్రదేశాలు, భారతదేశం ఎల్లప్పుడూ మా చరిత్రలో వివిధ సంక్షోభాలకు మొదటి ప్రతిస్పందనదారుగా ఉంది. భారతదేశ ప్రజలు మాతో కొనసాగించిన సన్నిహిత సంబంధానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది…మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారతదేశం స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని తెలిపింది. “COVID-19 సమయంలో మేము మా సరిహద్దులను తిరిగి తెరిచిన వెంటనే, మా పునరుద్ధరణ ప్రయత్నాలకు గొప్పగా సహాయపడిన కంట్రిబ్యూటరని పేర్కొంది. “మా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధం రాబోయే తరాలకు కొనసాగాలని మా హృదయపూర్వక కోరిక మరియు మా మంచి సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలు లేదా ప్రసంగాలకు దూరంగా ఉంటాము” అని పేర్కొంది.

భారత్ అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన EaseMyTrip, దౌత్యపరమైన గొడవల మధ్య మాల్దీవులకు విమాన బుకింగ్‌లను నిలిపివేసింది. మాల్దీవులను సందర్శించే వారిలో భారతీయులే ఎక్కువ ఉంటారు. శ్రీలంకకు పశ్చిమాన ఉన్న ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన ద్వీపసమూహంలో ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం. గత ఏడాది సెప్టెంబర్‌లో కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ తో విభేదాలు పెరుగుతాయి..