దుబాయ్ షేక్.. హల్ చల్… మాజీ మంత్రి మల్లారెడ్డి….!

*దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి.

మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్ షేక్ అవతార మెత్తారు.

దుబాయ్‌లో పర్యటిస్తున్న ఆయన.. ఎడారిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ టేరైన్ వెహికిల్‌ను జోష్‌తో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూత్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మల్లన్న.. ఎన్నికల తర్వాత రిలాక్స్ అవడానికి టూర్లు వేస్తున్న మాజీ మంత్రి.. ఆయనతో పాటు ఎన్నికల్లో కష్టపడ్డ కింది స్థాయి నేతలను కూడా తనవెంట తీసుకెళ్ళారు.