మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మొదట తానే చెప్పానని గుర్తు చేసుకున్నారు. పదేళ్ల కిందట 2014లోనే తాను ఈ విషయం చెప్పానని అన్నారు. ఆ సమయంలో ఓసారి బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఓ కార్యక్రమం జరిగిందని గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న తోట ముత్యాలమ్మ దేవాలయంలో ఇచ్చిన విందుకు హాజరైనప్పుడు తాను స్వయంగా రేవంత్‌ రెడ్డితో మాట్లాడానని అన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా..

నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ…

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి…