మల్లారెడ్డి.. సముద్ర తీరంలో ఎంజాయ్..

తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. ఎంత సీరియస్ వాతావరణాన్నైనా సరే ఆహ్లాదకరంగా మార్చి.. నలుగురిని నవ్వించేలా చేయడం మల్లారెడ్డి స్టైల్. ..మొన్నటి దాకా మంత్రి.. ఇప్పుడు ఎమ్మెల్యే.. అప్పుడూ ఇప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అంతే.. మంత్రి, అయినా.. ఎమ్మెల్యే అయినా.. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే.. మల్లారెడ్డి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సోషల్ మీడియా ఫాలోయింగ్ తగ్గట్టుగానే ఆయన కూడా కంటెంట్ ఇస్తూనే ఉంటారు.

తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ కోసం 70 ఏళ్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకి వెళ్లారు. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. ఈ వయసులో కూడా మల్లారెడ్డి.. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా.. అక్కడే బోటు నడిపి తెలుగు టూరిస్టులతో మల్లన్న ఎక్కడ ఉన్నా సరదనే అంటున్నారు….