సూర్యాపేట జిల్లా..
మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం..
ఇటివల అనుమతులు లేదు అంటు అభియోగాలు ఎదురుకుంటు నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగింది…
500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడిన కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందినా అరవింద్ సింగ్..
ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయినవి….
క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారు.
ప్రమాదంపై గోప్యత పాటిస్తున్న మై హోమ్ యాజమాన్యం…
పూర్తి విషయలు తెలపాలంటు బిహారి కూలీలకు, యాజమాన్యంకి మధ్య వాగ్వాదం జరిగింది..
*బిహారీ కూలీల తెలిపిన వివరాల ప్రకారం*
మొత్తం ఆరుగురు ఉన్నారని.. లిఫ్టులొ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి…
ఒకరు స్పాట్ లోనే చనిపోయినట్లు..
మరో ముగ్గురు లిఫ్ట్ కింద ఉన్నారని యాజమాన్యం అదె విషయాని బయటకు రాకుండా చూస్తున్నారని కూలీలు ఆరోపిస్తూ పోలీసులతో, మై హోమ్ ఎంప్లాయిస్ తో వాగ్వాదానికి దిగారు…
*యాజమాన్యం తెలుపుతున్న వివరాల ప్రకారం…*
ఒకరు మృతి చెందినట్లు తెలిపేరు… మరొకరికి తీవ్ర గాయాలైనట్లు అతని హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలిపారు..
అయితే విషయం మొత్తాన్ని గోప్యంగా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది…
అక్కడికి మీడియాని కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది..
Rdo..జగదీశ్వర్ రెడ్డి తెలిపినా వివరాల ప్రకారం.
మెళ్ళచెరువు మండల పరిధిలోని ఇండస్ట్రీలో నాలుగో ఫ్లాట్ నిర్మిస్తున్న నిర్మాణాలలో లిఫ్ట్ ఒక్కసారిగా విరిగిపడి దాని పైన ఉన్న ముగ్గురులో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు వారిని హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు.. మరికొంత విషయాన్ని పోలీసుల ద్వారా అడిగి తెలుసుకున్నా ఆతర్వాత మీడియాకు వివరిస్తానని తెలిపారు..