తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూత… అంతిమయాత్ర రూట్ మ్యాప్…

సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూత

గత పది రోజులుగా హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ఉపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ మృతి.

మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం.

భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించిన స్వరాజ్యం.

1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన మల్లు స్వరాజ్యం.

స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు.

సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మల్లు స్వరాజ్యం….

మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర వివరాలు
ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు హైదరాబాద్ ఎంబీ భవన్లో ప్రజల సందర్శనార్ధం ఉంటుంది…
నల్లగొండ పార్టీ కార్యాలయంలో 11 గంటల నుండి ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్థం ఉంటుంది.
ఒంటిగంటకు నల్గొండ సిపిఎం కార్యాలయం నుండి అంతిమయాత్ర బయల్దేరి మూడున్నర గంటలకు మెడికల్ కాలేజీకి పార్థివదేహాన్ని నాయకులు, కుటుంబ సభ్యులు అప్పగిస్తారు.