2024 లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను తిరస్కరణ ఎన్నికలు గా మార్చాలి…పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

మిష్టి (స్వీట్లు),లస్సీ (మజ్జిగ),పెరుగుపై కూడా GST వసూలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం…

అధికారంలో ఉన్న‌ బీజేపీని గద్దె దించేందుకు.. 2024 లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను తిరస్కరణ ఎన్నికలు గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలునిచ్చారు. కోల్‌కతాలో తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ సంకెళ్లను, దాని స్మారక అసమర్థతను బద్దలు కొట్టండి. ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని స్థాపించండని అన్నారు. 2024లో బీజేపీకి లోక్‌సభ మెజారిటీ రాదని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు.. GST నెట్‌లో లేని నిత్యావసరాలపై, వస్తు, సేవల పన్ను విధించడాన్ని వ్యతిరేకించారు. గ్యాస్ సిలిండర్ కటౌట్ ను చూపిస్తు.. బీజేపీ మతిస్థిమితం కోల్పోయిందని విమ‌ర్శించారు. మిష్టి (స్వీట్లు),లస్సీ (మజ్జిగ),పెరుగుపై కూడా GST వసూలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే.. అమరవీరుల దినోత్సవ ర్యాలీలో శ్రీమతి బెనర్జీ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా నిర్వహించలేద‌ని, గత ఏడాది పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వ‌హించే కార్య‌క్ర‌మని తెలిపారు. అలాగే .. ఇంధన ధరల పెర‌గ‌డంపై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణపై కూడా కేంద్రాన్ని దూషించారు. బిజెపి తన సొంత కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి అగ్నిపథ్ రక్షణ నియామక పథకాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు…మ‌హారాష్ట్ర రాజ‌కీయాల గురించి ప్ర‌స్త‌విస్తూ.. ఉద్ధయ్ థాకరే ప్రభుత్వంలో తిరుగుబాటుకు తీసుక‌వ‌చ్చి.. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వచ్చార‌ని బిజెపిని విరుచుక‌ప‌డ్డారు. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను విచ్ఛిన్నం చేశార‌నీ, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌ల‌పై బీజేపీ క‌న్నేసింద‌ని ఆరోపించారు. కానీ వారి రాజ‌కీయాలు బెంగాల్ లో సాగ‌వ‌నీ హెచ్చరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలువరించిందని ఆమె ఆరోపించారు…మా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఇవ్వకపోతే.. ఢిల్లీలో అడుగుపెడుతామని అన్నారు. ED, CBI (కేంద్ర దర్యాప్తు సంస్థలు)తో భయపెట్టడానికి ప్రయత్నించవద్దనీ, తాము పిరికివాళ్లం కాదనీ, పోరాడి గెలిచే శ‌క్తి ఉంద‌ని అన్నారు. కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్‌లో జరిగిన కార్యక్రమం తర్వాత.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతిస్తుందో లేదో నిర్ణయించేందుకు ఆమె పార్టీ నేతల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ..1993 జూలై 21న కోల్‌కతాలో 13 మంది తృణమూల్ కార్యకర్తలను కాల్చిచంపారు. వీరి జ్ఞాపకార్థం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ సమయంలో మమతా బెనర్జీ తృణమూల్ యూత్ కాంగ్రెస్ నాయకురాలు. అప్పటినుంచి ఆమె నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వ ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించబడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి, కాల్పులు కూడా జరిపారు. ఇందులో తృణమూల్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 13 మంది చనిపోయారు. అప్పటి నుండి.. మమతా బెనర్జీ ప్రతి సంవత్సరం జూలై 21ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.