రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ దృష్ట్యా సీఎం కేసీఆర్‌కు మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ‌..!!

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జ‌రిగే స‌మావేశానికి సీఎం కేసీఆర్‌ను మ‌మ‌త ఆహ్వానించింది. ఈ సంద‌ర్భంగా 8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స‌హా 22 మంది జాతీయ నేత‌ల‌కు మ‌మ‌త లేఖ రాశారు…రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా విప‌క్షాల‌ను బెంగాల్ సీఎం కూడ‌గ‌డుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వ‌హించే భేటీకి 22 మంది నేత‌ల‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్ సీఎంల‌తో పాటు ప‌లువురి ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు మ‌మ‌తా బెన‌ర్జీ.