జిల్లాలో 50 పాఠశాలను టచ్ ఫర్ ఛేంజ్ సంస్థ వారు మూడు సంవత్సరాలలో అభివృద్ది చేసేందుకు ఆమోదం..మంచు లక్ష్మి..

టిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ద్వారా జిల్లాలోని 50 పాఠశాలలో ఎంపిక చేసి మూడు సంవత్సరాల పాటు మూడు స్థాయిలలో 1 నుండి 5 వ తరగతి వరకు గల పిల్లలకు చదువులో నైపుణ్యం కల్పించేందుకు టిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ వారు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం బోధన కార్యక్రమనివినూత్నంగా ప్రారంభించి కొత్తగా అమలు చేయడం జరుగుతుందని దీని ద్వారా పిల్లలు బిగ్గరగా చదవడం తో వారికి చదువు పై ఆసక్తి పెరుగుతుందని , పాఠశాల నుండి ఇంటికి వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు ఇంటి వద్ద చదివించి సంతోషం వ్యక్తం చేస్తున్నారని , తల్లిదండ్రుల బాద్యత బడికి పంపడమే మాత్రం కాదని వారి అలువాట్లను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని, చెడు అలవాట్లు, చెడు సావాసాలు చేయకుండా చూసుకోవాలని, పాఠశాల ఉపాధ్యాయులు తమ సాయా శక్తిగా కృషి చేసి పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారని, కోవిడ్ సమయంలో వాట్సాప్ గ్రూప్ ల ద్వారా , ఆన్లైన్ ద్వారా పిల్లలకు చదువు చెప్పారని కలెక్టర్ అన్నారు. పిల్లల తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు పాఠశాలలో ఏర్పాటు చేయాలని అన్నారు.

టిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సభ్యురాలు మంచు లక్ష్మి మాట్లాడుతూ… జిల్లాలో చేపట్టిన బుధవారం బోధన చాలా బాగుందని చదువు ఎక్కడో లేదని మన అందరి మధ్యలోనే ఉంటుందని, చదువును ఎవ్వరూ దొంగలించలేరని , చదువు ద్వారా నైపుణ్యం పెంపెందించుకోవలని , చదువుతో అన్నీ సాదించుకోవచ్చునని ఆమె అన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలని తెలంగాణ లో విద్యలో మంచి కాంపిటీషన్ ఉందని పాఠశాలలో డ్రాప్ ఔట్స్ తగ్గించాలని ఆమె అన్నారు. అమ్మ నాన్నలు, పిల్లలను పొగడవద్దనేది తప్పు అని , అమ్మ నాన్నలకు పిల్లలు తమ ఇంటి హీరోలని ఆమె అన్నారు. .జిల్లాలో 50 పాఠశాలను టచ్ ఫర్ ఛేంజ్ సంస్థ వారు మూడు సంవత్సరాలలో అభివృద్ది చేసేందుకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా మన ఊరు మన బడి, స్మార్ట్ క్లాస్ రూమ్ లు ప్రారంభించి మూడు స్థాయిలలో 1 నుండి 5వ తరగతి పిల్లలకు విద్య నైపుణ్యం పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ యాదాద్రి జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు ఇందులో బాగంగా మొదటిగా పటేల్ గూడెం పాఠశాలను సందర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్య శాఖ అధికారి నారాయణ రెడ్డి, టిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సభ్యులు చైతన్య, కొ ఆర్డినేటర్ అండాలు, సంబందిత విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.