మావోయిస్టుల కంటే బీజేపి పార్టీ ప్రమాదకరం… పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

మావోయిస్టుల కంటేకాషాయ పార్టీ ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. మంగళవారం పురులియాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ సమావేశంలో అవాంతరాలు సృష్టించేందుకు బీజేపీ కొంత మందిని పంపిస్తుందని ఆరోపించారు.

నక్సలైట్ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన పశ్చిమ బెంగాల్ లో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలోగానీ, ప్రజాస్వామిక పంథాలో నడిచే సీపీఎంను నిర్వీర్యం చేయడంలోగానీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర అందరికీ తెలిసిందే. అయితే మావోయిస్టులు, లెఫ్ట్ పార్టీలను ధీటుగా నిలువరించిన తన పరిస్థితి ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అయిందన్నట్లుగా.. బెంగాల్ లో బీజేపీ విస్తరణపై మమత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఎర్రజెండాలను ఢీకొట్టినట్లే, కాషాయ దాడిని దీటుగా ఎదుర్కొంటానని ఆమె అంటున్నారు..పురూలియా జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమత..జంగల్ మహల్ ఏరియాలోని ఆదివాసీ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు మమత. లోక్​సభ ఎన్నికల్లో జంగల్​ మహల్​ ఆదివాసీలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన బీజేపీ… గెలిచాక వారిని పట్టించుకోలేదని విమర్శించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పురూలియాతో సహా జంగల్ మహల్ ఏరియాలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజకీయాలనేవి గంభీరమైన సిద్దాంతాలు మరియు ఫిలాసఫీ అని.. అయితే అవి బట్టలమాదిరిగా రోజూ మార్చే సిద్దాంతాలుగా ఉండకూడదని మమత అన్నారు.