చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్..!

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్

రూ.42 కోట్ల వసూళ్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశం

మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రత్యేక షో టికెట్ ధర రూ.600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుతూ ఈ నెల 8న మెమో జారీ చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి..

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెమో జారీ చేసి రూ.42 కోట్లు అక్రమంగా ఆర్జించారని వాటిని రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి

దీనిపై విచారణ జరిపి రూ.42 కోట్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులను ఆదేశించిన హైకోర్టు

ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వచ్చే నెల 3కు వాయిదా..