మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాసం తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ..

*Breaking News*

మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల మున్సిపాలిటీ లో ఎగిరిన కాంగ్రెస్ జెండా, దిగిన బీఆర్ఎస్ జెండా

మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాసం తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ….

మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీస్ అందించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంపుకు బయలుదేరి వెళ్లారు. మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా 26 మంది కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ నెల 11న అవిశ్వాస పరీక్ష జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో క్యాంపుకు వెళ్లారు. అవిశ్వాస పరీక్ష రోజున నేరుగా వీరు మున్సిపల్ సమావేశానికి హాజరు అయ్యారు…
27 మంది కౌన్సిలర్ల మద్దతుతో సునాయాసంగా అవిశ్వాస తీర్మానం లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ

మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ

అవిశ్వాస తీర్మానం లో పాల్గొన్న 26 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్, బిజెపి పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్…..

అవిశ్వాస తీర్మాన నివేదికను మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కు అందించిన స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో రాములు….

అవిశ్వాస తీర్మానం లో తమకు మెజారిటీ లేదని ముందే రాజీనామా చేసిన బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్..