మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ.

మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ….

ఫిల్మ్ నగర్ ఆఫీసులో రూ. 5లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీ…

తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలుగా కొనసాగుతోన్న మంచు కుటుంబానికి సంబంధించి మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు దొంగలు ఝలకిచ్చారు. ఫిలింనగర్ లో ఉన్న మా ఆఫీసులో, ప్రెసిడెంట్ విష్ణు ఛాంబర్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మా అధ్యక్షుడి ఆఫీసులో చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు..మంచు విష్ణు మా ఆఫీసులో చోరీపై ఆయన మేనేజర్ సంజయ్ స్వయంగా పోలీసులుకు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దొంగలు.. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దుండగులు అపహరించిన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా. కాగా,మంచు విష్ణు మేనేజర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరుస వివాదాలు, సినిమా వైఫల్యాలకు తోడు ఇప్పుడు చోరీ ఘటన కూడా మంచు కుటుంబాన్ని కలవరపెట్టినట్లయింది. ఆఫీసులో చోరీ విషయమై విష్ణు నేరుగా స్పందించాల్సి ఉంది.