మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం…

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి.
తాజాగా కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున అధునాతన ఆయుధాలతో వచ్చిన సాయుధ వ్యక్తుల బృందం కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని ఓ గ్రామంపై ఆకస్మికంగా దాడి చేసింది.
గ్రామంలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు గ్రామస్థులు బుల్లెట్ గాయాల కారణంగా అక్కడికక్కడే మృతి చెందారు.