మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత..

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఏడాది కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో మన్మోహన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరారు.