భారత సంతతికి (Indian origin) చెందిన సిక్కు మహిళ మన్‌ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించింది. హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికై రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఆమె శుక్రవారం టెక్సాస్‌లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో జడ్జిగా ప్రమాణం చేసింది. దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా (Sikh Woman) ఆమె చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల మన్‌ప్రీత్ సంతోషం వ్యక్తం చేసింది.1970లో మన్‌ప్రీత్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్లోనే (Houston) పుట్టి పెరిగిన మన్‌ప్రీత్.. భర్త, ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం బెల్లయిరేలో (Bellaire) నివాసముంటోంది. హ్యూస్టన్లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేసింది. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని కూడా ఆమె వాదించింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.