కాంగ్రెస్ పార్టీ వస్తే కోతలు…వాతలే..మంత్రి జగదీష్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ వస్తే కోతలు…వాతలే…
సూర్యాపేట జిల్లా…
హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో రైతు వేదిక లొ రైతు సమావేశానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి..
ఎమ్మెల్యే సైదిరెడ్డి…
BRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి yv వెంకటేశ్వర్లు…
పాల్గోన్న రైతులు.. BRS శ్రేణులు…
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ అంటేనే,, కోతలు వాతలు…
కాంగ్రెస్ పార్టీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా రైతులకి నాణ్యమైన 24 గంటలు కరెంటు అందించిన దాఖలానే లేదు…..దేశాన్ని 70 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏలిన రాష్ట్రాల్లో ప్రస్తుతం కూడా కరెంటు చూడని గ్రామాలు ఎన్నో ఉన్నాయి…చత్తీస్గడ్ లో ఆ రాష్ట్రానికి మించిన విద్యుత్ తయారి అవుతున్నా కానీ అక్కడ రైతులకు నేటి వరకు కూడా 24 గంటలు కరెంటు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలందరూ గుర్తించాలి…
TPCC రేవంత్ రెడ్డి,, చంద్రబాబు శిష్యుడు మాట్లాడిన మాటల్లో రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని చెప్తున్న మాటలన్నీ కూడా ఆ పార్టీ సిద్ధాంతాలే…బిజేపి పాలనకు గత్యంతరం లేక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారే తప్ప ఆ పార్టీ వల్ల అక్కడ ఒరిగేది కూడా ఏమీ లేదు…కర్ణాటకలో కూడా రైతులకు 24 గంటలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు..
కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది లేదు…. ఏఐసీసీ ఒకటి మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొకటి మాట్లాడతారు….
రేవంత్ రెడ్డి కి అడిగిన వాటికి సమాధానం చెప్పడం చేతకాక బూతు పురాణాలు మొదలు పెడతారు…అది ఓక నాయకుడి లక్షణం కాదు అని వారి పార్టి నాయకులే చెప్తున్నారు….
వారికి పదవులపై ఉండే వ్యామోహం ప్రజా పాలనపై ఉండదు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే..రైతులకి ఉచిత 24 గంటలు కరెంటు ఉండదు..రైతు బీమా, రైతుబంధు ఉండదు..కల్యాణ లక్ష్మి ఉండదు..ఇంకా ఎన్నో పథకాలను కూడా వారు ప్రజలకు ఉపయోగపడే వాటిని తొలగించి వేస్తారు..సీఎం కేసీఆర్ అయితేనే ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు..
సీఎం కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..ఏ ఐ సి సి నిర్ణయాన్నే బుడ్డర్ ఖాన్ లు,పేపర్ పులులు బహిర్గతం చేశారు.ఎనిమిది గంటల విద్యుత్ సరఫరానే కాంగ్రెస్ రహస్య ఎజెండా..24 గంటల విద్యుత్ విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదు..అదే నిజం అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు
#ఛత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి సరఫరా 7 గంటలే..అది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానే..బుడ్డర్ ఖాన్ నోటి వెంట మూడు గంటల విద్యుత్.గుజరాత్ లో ఇచ్చేది ఆరు గంటలే.ఉత్తర ప్రదేశ్ లో కరెంట్ లేని గ్రామాలు కోకొల్లలు..2014 లో గులాబీ జెండాను ఎత్తుకోక పోతే ఇక్కడ అదే పరిస్థితి..పేపర్ పులి నోటివెంట సంక్షేమ పథకాలు ఎత్తివేత ప్రకటన.జరగకూడనిది జరిగితే ఫించన్ 200 కు కుదింపు,కల్యాణలక్ష్మి/షాది ముబారక్ లకు మంగళం, రైతుబందు, రైతుభీమా ఎత్తివేతకు ఏ ఐ సి సి గ్రీన్ సిగ్నల్.బూతులతో అబద్దాలు కప్పిపుచ్చుకుంటున్న బుడ్ధర్ ఖాన్. పెట్టె రైతుకు సున్నం పెట్టె కుట్రలు..జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం…