చంద్రబాబు నాయుడుకి వైయస్ జగన్ అంటే ఏమిటో తెలిసింది.. మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు నాయుడుకి వైయస్ జగన్ అంటే ఏమిటో తెలిసిందన్నారు..సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉంటుందని తాను భావిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేదు.. ఆయన కొడుకు వైఎస్ జగన్ ఏం చేస్తాడు.. బచ్చా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేవారు. గుంటూరులో బుధవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏం చేస్తారో జగన్ చంద్రబాబు చూపించారన్నారని హెచ్చరించారు. జగన్ దెబ్బకు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు…