మంత్రి బొత్స సత్యనారాయణ గుండెనొప్పి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారిక సదస్సులో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యారు..తక్షణం ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నంలో ప్రాధమిక వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స జరిగింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ఉండగా మంత్రి బొత్స ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. దాంతో వెంటనే విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్సకై హైదరాబాద్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. నిన్న రాత్రి మంత్రి బొత్సకు గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. ఉదయం 10 గంటల్నించి మద్యాహ్నం వరకూ ఆపరేషన్ జరిగింది. నెలరోజులు హైదరాబాద్‌లోనే ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ పార్టీ ఆవిర్భావం తరువాత జగన్‌కు తోడుగా నిలిచారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు..