మంత్రి ఎర్రబెల్లికి షాక్…పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవస్థాన డైరెక్టర్ కాలుసాని ఉప్పల్ రెడ్డి వంద మంది అనుచరులతో కాంగ్రెస్ లొ చేరిక.

*బిగ్ బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లికి బిగ్ షాక్*

*పాలకుర్తి దేవస్థాన డైరెక్టర్ ఉప్పల్ రెడ్డి రాజీనామా – కాంగ్రెస్ లో చేరిక*

పాలకుర్తి నియోజకవర్గ నాయకులు BRS ఒక్కకరుగా రాజీనామా..!

పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవస్థాన డైరెక్టర్ కాలుసాని ఉప్పల్ రెడ్డి వంద మంది అనుచరులతో కలిసి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంత్రి దయాకర్ రావు ఒంటెద్దు పోకడలు సహించలేక, అవమానాలకు గురిచేసిన కూడా సహించినప్పటికిని, ప్రాముఖ్యత ఇవ్వక పోవడం, మరియు బి ఆర్ ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డి క్యాంప్ తొర్రుర్ కార్యాలయంలో వంద మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరి చేరికను ఝాన్సీ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేగుల గ్రామం చిన్న గ్రామం అయినా ఐక్యతకు స్ఫూర్తి అని, అన్యాయం జరిగితే పోరాడుతారని, ప్రతిభ లో, సేవలో, రాజకీయ సేవలో సైతం ముందుంటారని, గ్రామానికి అండగా ఉంటానని ఝాన్సీ రెడ్డి అన్నారు.
ఇప్పటికే రేగుల గ్రామంలో 80% మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ రెడ్డి చేరికతో మరింత బలం చేకూరుతుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విజయ సాధించుటకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల వేణుగోపాల్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి, నారా బోయిన గూడెం కాంగ్రెస్ నాయకులు రెంటాల వెంకటరెడ్డి, కమలాకర్ రెడ్డి, బొమ్మెరబోయిన శివ, మహేందర్, వెంకటాచారి, దోపతి వీరన్న, జంపయ్య తదితరులు బారి ఎత్తున పాల్గొన్నారు.