తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు…..

నెల్లూరు చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు..

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అభిమానులు…

కడచూపు నోచుకోని సొంత ఊరు సొంత నియోజకవర్గం…

నెల్లూరు..

ఎప్పుడూ చిరునవ్వుతో పూర్తిగా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు…

నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం సొంత జిల్లా నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి డెడ్‌బాడీని నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు తరలించారు. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని మంత్రి అనిల్ కుమర్ తదితరులు దగ్గరుండి తరలించనున్నారు. ఇప్పటికే గౌతమ్‌ రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు మేకపాటి అభిమానులు..

గ్రామస్తుల్లో అభిమానుల్లో, ఆవేదన.….

తనకు జన్మనిచ్చిన సొంత ఊరుకు అలాగే 9ఏళ్ల రాజకీయ బంధం ఉన్న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం చివరిచూపు నోచుకోకపోవడం సొంత గ్రామస్తులు,అభిమానులు ఆవేదనచెందుతున్నారు… కనీసం సొంత గ్రామానికి అయిన మేకపాటి కడచూపు నోచుకుంటే బాగుండేది అని స్థానికులు చర్చించుకుంటున్నారు.మేకపాటికి ఏమాత్రం బంధం లేని నెల్లూరు సిటీ కి, ఉదయగిరి కేంద్రానికి మాత్రమే మేకపాటి చివరిచూపు దర్శనానికి పరిమితం చేయడంతో ఆత్మకూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు… రేపటి వరకు సమయం ఉన్నందున కనీసం ఉదయగిరి కి వెళ్లే సమయంలో నైనా ఒక్క పది నిమిషాలు తన నియోజకవర్గ కేంద్రానికి లేదా సొంత గ్రామానికైనా మేకపాటి భౌతికకాయాన్ని *చివరిచూపు* గా తీసుకువస్తే *మేకపాటి ఆత్మశాంతిస్తుందనే* అభిప్రాయాన్ని అభిమానులు కొందరు వ్యక్తపరుస్తున్నారు……