బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారు..మంత్రి హరీష్ రావు.

మంత్రి టి. హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేషం ప్రెస్ మీట్ @మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
….మంత్రి టి. హరీష్ రావు…
…బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోంది
..నిన్న బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడింది
…బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు
..భవిష్యత్ తరాలకు బీజేపీ సందేశం ఇవ్వదలుచుకుంది
..బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారు
…విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలి
..బీజేపీ కి చదువు విలువ తెలియదు
..బీజేపీ లో చదుకున్నోళ్లు తక్కువ
…పేపర్ లీకేజీ లో బండి సంజయ్ ప్రధాన కుట్ర దారు
…తాండూరు లో లీకేజీ కి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘం లో ఉన్నారు
…నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీ లో ఉన్నారు
..ప్రశాంత్ కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి
…నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది… సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది
..బీజేపీ కి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయింది
…నడ్డా సంజయ్ ను సమర్ధించడం సిగ్గు చేటు
…పట్టపగలు బీజేపీ నగ్నం గా చిక్కింది
…ghmc ఎన్నికలప్పుడు, tspsc లీకేజీ లో ,ఎమ్మెల్యేల కొనుగోలు లో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయి
…బండి సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయ దలుచుకున్నా.
..పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా
…ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని నీకు వాట్సాప్ లో పంపింది నిజమా కాదా
…రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడింది నిజమా కాదా
…పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్ లకు మీ ప్రోద్భలం తో పంపింది నిజం కాదా
..ప్రశ్న పత్రం వ్యాప్తి లో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావ్
…రోజుకో ప్రశ్న పత్రం వాట్సాప్ లో వ్యాప్తిచేయించాలని నీవు కుట్ర పన్నింది నిజం కాదా
…సోషల్ మీడియా లో ప్రశ్న పత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్తలు కాదా
…ప్రశ్నా పత్రాలు నిందితుడు మీకు పంపితే తప్పేమిటని మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిస్దిగ్గుగా సమర్ధిస్తున్నారు
..ప్రశ్న పత్రం మీకు 11.20 కి పంపానని నిందితుడు చెప్పారు.వాట్సాప్ రికార్డుల్లో కూడా ఉంది
..పదో తరగతి పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు.. ఈ మధ్యలో ఎవరు ఎవరికి షేర్ చేసినా అది నిబంధనలకు విరుద్ధమని తెలియదా
….మీ ఎమ్మెల్యేకు నిబంధనలు తెలియవా ఎంపీ గా ఉన్న మీకు కూడా నిబంధనలు తెలియవా
…ఇంత నిస్దిగ్గుగా తప్పుడు చర్యలను సమర్ధిస్తున్న మీరు ఓ జాతీయ పార్టీ శాఖ కు అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతారు
..మీ చర్యలకు మీ అధిష్టానం మద్దతు ఉందా
…యూపీ, గుజరాత్ లలో పేపర్ లీకేజీలు నిత్య కృత్యమే.. అక్కడి ప్రభుత్వాల నుంచి ఇక్కడ పేపర్లు లీకు చేయడానికి మీరు అనుభవం గడించారా
..నీ ప్రశ్నల్లో పస లేదు .నువ్వు ప్రశ్నిస్తే బెంబేలెత్తడానికి ఏం లేదు
..చట్టం తన పని తాను చేసుకు పోతుంది
…విద్యార్థుల జీవితాల తో ఆడుకునే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు
..ముగ్గుర్ని ప్రభుత్వ ఉద్యోగుల పై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం
..ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే యువత బీజేపీ కి దూరమవుతుందని నువ్వే బహిరంగంగా ప్రకటించావు
…ఆ ప్రకటనకు దగ్గట్టే నీ చేష్టలు ఉన్నాయి
…ప్రతి చిన్న ఘటనకు కేసీఆర్ కు ఆపాదించే నువ్వు సమాజం లో తలవంచుకునే చర్యకు పాల్పడ్డ0దుకు ఏం చేయాలి
…రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్
…బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా మీ గుండా గిరి తెలంగాణ లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం
…బీజేపీ కి బండి చేతిలోనే మూడినట్టుంది
..కేసీఆర్ ముందు నీ పప్పులు ఉడకవు
…హనుమంతుడి ముందు కుప్పి గంతులు మానండి..
…మీకు ఫేక్ డిగ్రీలు కామన్ కావచ్చు.. కానీ ఎంతో మంది కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడవద్దు
…బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు
..తెలంగాణ ను ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది.. దాన్ని కేసీఆర్ ఎదుర్కొంటారు
..బీజేపీ కుట్రలు చేదిస్తూనే ఉంటాం.. తెలంగాణ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
…చట్టం ఎవరికైనా ఒక్కటే
…బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నాం